కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

Update: 2024-12-01 13:12 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని.. ఈ సర్కారు ఉత్త బేకార్ గా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరని, రాష్ట్రంలో ఏ వర్గం కాంగ్రెస్ పాలనను మెచ్చుకునే పరిస్థితి లేదని.. ఇది గమణించిన ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడని, మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడంటూ హరీశ్ రావు ట్వీట్ చేశాడు. హరీశ్ రావు తన ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. "నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలి నువ్వు కాదు రేవంత్ రెడ్డి. నీ అపరిపక్వత (ఇన్ మెచ్యూరిటీ), నీ అసమర్థత (ఇన్ క్యాపబులిటీ), నీ ప్రతికూల వైఖరి (నెగిటివ్ ఆటిట్యూడ్) వల్ల రాష్ట్రంలో నేడు అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నది. మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు అని రాసుకొచ్చారు. అలాగే చివర్లో NOTE అని పెట్టి.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15 వేలు ఇస్తామని చెప్పిన విషయం. నీకు గుర్తు లేకపోవచ్చు రేవంత్ రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి." అని తన ట్వీట్ లో హరీష్ రావు రాసుకొచ్చారు.


Similar News