CM కావాలని ఉన్నా బయటపెట్టను.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
"సీఎం కావాలని ఆసక్తి ఉన్నా.. బయటకు చెప్పలేను కదా..!. పీసీసీ చీఫ్ హోదాలో అందరి అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : "సీఎం కావాలని ఆసక్తి ఉన్నా.. బయటకు చెప్పలేను కదా..!. పీసీసీ చీఫ్ హోదాలో అందరి అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన శనివారం గాంధీభవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు." జై బజరంగబళి అనే నినాదమే బీజేపీని ఓడించింది. హనుమంతుడికి కోపం వచ్చింది. జై శ్రీరాం అనే నినాదాన్ని వదిలేసి బీజేపీ బజరంగబళి నినాదం ఎత్తుకుంది. అందుకే బీ జే పీ ఓటమిపాలైంది. ఇక రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కాంగ్రెస్‌కు 80కిపైగా సీట్లు వస్తాయన్నారు.బీఆర్‌ఎస్‌కు 25లోపు, బీజేపీకి 9లోపు, ఎంఐఎంకి 7 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని స్పష్టం చేశారు. కర్ణాటకలో పే సీఎం ప్రచారం బాగా పనిచేసిందన్నారు. సునీల్ కనుగోలు టీం బాగా పనిచేసిందన్నారు. నెక్స్ట్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టామన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద స్పష్టంగా ఉంటుందన్నారు. దీంతో కర్ణాటక ముఖ్య లీడర్లతో పాటు ఏఐసిసి నేతలంతా తెలంగాణ రాష్ట్రంలో మకాం వేయనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు భారీ సభలకు ప్లాన్ చేశామన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ ,ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ,మల్లికార్జున ఖర్గే లతో పాటు డీకే శివ కుమార్ లాంటి నేతలు కూడా తెలంగాణలో భారీ సభలు, ఇంటింటికి కాంగ్రెస్ వంటి కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు
Read More... తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందా?