ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా.. ఖంత్రివా..! : షర్మిల

అవుతాపూర్‌లో వైఎస్‌రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చడం నీచమైన చర్య అని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Update: 2023-03-01 08:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అవుతాపూర్‌లో వైఎస్‌రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చడం నీచమైన చర్య అని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. అర్ధరాత్రి బీఆర్ఎస్ గూండాలు విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. మహిళలు చలిమంట వేసుకొని కట్టించిన విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి మరీ పడగొట్టించారని ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహా ఏర్పాటును అడ్డుకునేందుకు మంత్రి ఎర్రబెల్లి మొదటి నుంచి శతకోటి ప్రయత్నాలు చేశారన్నారు.

ముందుండి నిలబడ్డ మహిళలకు పథకాలు బంద్ పెడతానని బెదిరింపులకు గురిచేశాడన్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వైఎస్సార్ అభిమానాన్ని తట్టుకోలేక ఈ పని చేశాడని షర్మిల విమర్శించారు. ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా..ఖంత్రివా..! అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాల మీద రాజకీయం చేయడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేని అసమర్థ మంత్రి దయాకర్ రావు అని విమర్శించారు.

బీరు బాటిళ్లు, బ్రాండి బాటిళ్లు అమ్ముకో అని చెప్పిన..చదువు, సంస్కారం లేని వ్యక్తిని మంత్రిని చేస్తే విగ్రహాలను పడగొట్టడం మీదున్న సోయి అభివృద్ధి మీద ఎక్కడుంటది? అని ప్రశ్నించారు. నిజంగా దయాకర్‌కు దయ ఉంటే వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టించి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క విగ్రహాన్ని పడగొడితే పాలకుర్తిలో వెయ్యి విగ్రహాలు పెడతామని షర్మిల ఫైర్ అయ్యారు. 

Tags:    

Similar News