పీఆర్సీ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు : పీఆర్టీయూ

రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-08-12 16:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను శివశంకర్ ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సిద్ధం చేసిన పీఆర్సీ నివేదికను సీఎంకు పంపించాలని కోరారు. అనంతరం తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిట్ మెంట్ పై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 2005 పీఆర్సీ నుంచి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల వేతన వ్యత్యాసం ఇప్పుడు వేలల్లోకి వెళ్లిందని, ఆ వ్యత్యాసాన్ని తగ్గించి వేతనాన్ని పెంచి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే కర్మకాండలకు 11 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు గత పీఆర్సీలో తీరని నష్టం జరిగిందని, కావున వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేలా ప్రతిపాదనలు పంపించాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను కోరారు. అన్ని గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు 010 ఆర్థిక పద్దు ద్వారా వేతనాలు అందించాలన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్ ప్రతిపాదనలు కూడా పంపించాలని కోరారు. వినతి అందించిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యుగంధర్ రెడ్డి ఉన్నారు.


Similar News