అలరించిన కుక్కల పరుగు పందెం.. బహుమతులు ఏ రాష్ట్రం గెలుచుకుందంటే..

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుక్కలకు పరుగు పందెం పోటీలను నిర్వహించారు.

Update: 2023-02-12 13:16 GMT

దిశ, అలంపూర్ / అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుక్కలకు పరుగు పందెం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కుక్కలు పరుగు పందెం పోటీలకు వచ్చాయి.

సుమారు 19 జతలు రాగా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుక్కలు నాలుగు బహుమతులను కైవసం చేసుకున్నాయి. మొదటి బహుమతి ఇండి గ్రామం, కర్ణాటక రాష్ట్రంకు చెందిన విఐపీ లల్యా డాగ్ గెలుపొందగా ఆ యజమానికి రూ.15 వేల నగదు, అదే గ్రామానికి చెందిన సుల్తాన్ డాగ్ రెండో స్థానంలో నిలిచి రూ. 10వేల నగదు, అదే గ్రామానికి చెందిన తేజకళ్ల డాగ్ మూడో స్థానంలో నుంచి రూ. 8 వేల నగదు, కర్ణాటక రాష్ట్రం బాపురంకు చెందిన అంజి డాగ్ నాలుగో స్థానంలో నిలిచి రూ. 5 వేల నగదు బహుమతలను కైవసం చేసుకున్నాయి. 

Tags:    

Similar News