IT Raids effect : తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఎమర్జెన్సీ మీటింగ్
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ నేతలపై వరుస ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. మంగళవారం ఉదయం మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీ, కాలేజీల్లో ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడంతో టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ నేతలపై వరుస ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. మంగళవారం ఉదయం మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీ, కాలేజీల్లో ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడంతో టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడుల నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్ లో మంత్రులు, ఎమ్మెల్యేలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తాయని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు అలర్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చెప్పినట్టుగానే ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రుల్లో ఒక్కొక్కరుగా చిక్కుల్లో పడుతున్నారు. క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు ఆయన పీఏను ఈడీ విచారించగా తాజాగా మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, గ్రానైట్ ఎక్స్ పోర్ట్ వ్యవహారంలో ఈడీ తనిఖీలు, లైగర్ మూవీలో పెట్టుబడుల వ్యవహారంలో ఐటీ, ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువైపు నుంచి నోటీసులు వస్తాయో అన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయ వ్యవహారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడులను టీఆర్ఎస్ అధినేత ముందుగానే ఊహించినప్పటికీ ఈ పరిణామాలను ఎలా ఎదుర్కోబోతోందనేది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి: మహిళా కళాశాల భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. రక్షించాలని ధర్నా
MLC కవిత నేతృత్వంలో 'భారత్ జాగృతి ఫౌండేషన్'.. పెట్టుబడి లక్ష.. విరాళాలు కోట్లలో!
ఇవి కూడా చదవండి: IT Raids On Malla Reddy: సోదరుడి ఇంట్లో లాకర్ కనుగొన్న ఐటీ అధికారులు