Elections Survey: మూడో సారి బీజేపీయే.. తెలంగాణ, ఏపీలో గెలిచేది ఎవరంటే?

ముచ్చటగా మూడో సారి బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ‘టైమ్స్ నౌ నవభారత్’ సర్వే తెలిపింది.

Update: 2023-07-01 15:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముచ్చటగా మూడో సారి బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ‘టైమ్స్ నౌ నవభారత్’ సర్వే తెలిపింది. ‘జన్ గన్ కామన్’ అనే పేరుతో నిర్వహించిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. బీజేపీ కూటమి 285-325 సీట్లు గెలవడం పక్కా అని తాజా సర్వే తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి 111-149 సీట్లు వస్తాయని తేల్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ 9 నుంచి 11 ఎంపీ స్థానాలు సాధిస్తుందని ఈ సర్వే తెలిపింది. ఏపీలో వైఎస్సార్ సీపీ పార్టీ 24-25 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. యూపీలో ఎంపీ ఎలక్షన్స్ లో 50.30 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది. వైఎస్సార్ సీపీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే చాన్స్ ఉన్నట్లు సర్వే తెలిపింది.

Tags:    

Similar News