విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. దసరా సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో జూన్ 12కు పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో విద్యాశాఖ అలర్టై, ప్రభుత్వ పాఠశాలలు, ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఫొకస్ చేసింది.ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో అన్ని

Update: 2023-06-07 02:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో జూన్ 12కు పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో విద్యాశాఖ అలర్టై, ప్రభుత్వ పాఠశాలలు, ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఫొకస్ చేసింది.ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డేగా పాటించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే 2023,24కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రోజూ అరగంట పుస్తకాలు చదివించాలని, వారాని మూడు,ఐదు పీరియడ్లు ఆటలకు కేటాయించాలని సూచించింది. అలాగే దసరా సెలవులపై కీలక ప్రకటన చేసింది. గతేడాది పండగ సెలవులు 14 రోజులు ఉండగా, ఈ సారి 13 రోజులే( అక్టోబర్ 13 నుంచి 25) వరకు ఇచ్చారు. అదేవిధంగా క్రిస్మస్ సెలవులను ఏడు రోజుల నుంచి ఐదుకు తగ్గించారు. 

Tags:    

Similar News