Kalvakuntla Kavitha : ఈడీ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌పై 29న నిర్ణయం
కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై వాదనలు పూర్తయ్యాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందుతుడికి సంబంధించిన అన్ని వివరాలను చార్జిషీట్ లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే ఈ సప్లిమెంటరీ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తి కాగా ఆర్డర్ ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేశారు. ఈనెల 29న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ ప్రత్యేక కోర్డు జడ్జి చెప్పారు. అలాగే కేజ్రీవాల్ పై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై ఈనెల 28న వాదనలు మొదలు కానున్నాయి.