అలర్ట్: స్టాఫ్ నర్సు పోస్టులకు అప్లై చేశారా?
స్టాఫ్ నర్స్ పోస్టుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం ఇచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: స్టాఫ్ నర్స్ పోస్టుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచింది. ఈ మేరకు శుక్రవారం ఓ నోట్ విడుదల చేసింది. ప్రభుత్వ దవాఖానలు, ఇతర సంస్థల్లో 5204 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నాటికి అప్లికేషన్ గడువు ముగిసింది. సుమారు 48 వేల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.