హైదరాబాద్, ఒంగోలులో ఈడీ సోదాల కలకలం

హైదరాబాద్‌లోని చదలవాడ ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Update: 2024-06-06 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చదలవాడ ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్‌బీఐ నుంచి రూ.167 కోట్ల రుణాలను తీసుకుని తిరిగి కట్టడం లేదన్న ఆరోపణలపై తనిఖీ చేపట్టింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారుల విచారణ చేపట్టారు. హైదరాబాద్, ఒంగోలులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర అవసరాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   


Similar News