BREAKING: కవిత అరెస్ట్ వేళ కేటీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాకిచ్చింది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులపై దౌర్జన్యం చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఈడీ ఆఫీసర్స్ ఫోన్లో బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఓ పక్క కవిత అరెస్ట్ కావడం.. మరో పక్క కేటీఆర్‌పై కేసు నమోదు కావడం బీఆర్ఎస్ వర్గా్ల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, ఇవాళ మధ్యాహ్నం నుండి హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అరెస్ట్ వారెంట్ జారీ చేసి సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ట్ పోర్టుకు తరలించి.. అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి నేరుగా కవితను ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్న అధికారులు.. ఇవాళ రాత్రి ఆమెను అక్కడే ఉంచనున్నారు. రేపు (శనివారం) కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించి.. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది.