Etela Rajender: ఆ విషయం నేను ముందే చెప్పా.. ఆర్.కృష్ణయ్య పొలిటికల్ కెరీర్ పై ఈటల సెన్సేషనల్ కామెంట్స్

ఆర్.కృష్ణయ్య పొలిటికల్ కెరీర్ పై ఈటల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-09-26 09:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పొలిటికల్ కెరీర్ పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మీపై ముద్ర పడవద్దని, బీసీ వర్గాల నాయకుడిగా మాత్రమే రాణించగలవని నేను గతంలోనే ఆర్.కష్ణయ్యకు చెప్పానని ఈటల అన్నారు. ఇది నాది అని చెప్పుకునే తృప్తి రాజకీయ పార్టీలలో ఉండదని అది కేవలం సంఘాలలో మాత్రమే ఉంటుంన్నారు. రాజకీయ పార్టీలలో కృష్ణయ్య ఇమడలేకపోతున్నారని అన్నారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్య త్వరలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తానన్నారు. ఆదిశగా పార్టీ పెట్టాలని తనపై ఒత్తిడి ఉందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలో ఉంటే రాణించలేవంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. గురువారం నారాయణగూడలో బీసీ కుల సంఘాల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కులగణన విషయంలో..

కులగణన అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకుంటే మంచిదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరిలో ఉన్నాయని, ఓ రాష్ట్రంలో ఓసీ అనుకున్న కులం మరో రాష్ట్రంలో బీసీగా పరిగణించబడుతున్నందునా జనగణన సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టి కులాల వారీగా లెక్కలు బయటకు తీయాలన్నారు. అలా చేస్తే కోర్టులు కూడా అడ్డుచెప్పే ఆస్కారం లేదని తమిళనాడు ఉదంతాన్ని చదివిన వ్యక్తిగా చెబుతున్నాన్నారు. ప్రస్తుతం మతం, కులం, జాతీయత దాస్తే దాగేవి కావన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నదని ఇంకా కులం ఎక్కడ ఉందనే వాళ్లు ఉన్నారు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో ఇంకా కులం ఉందనేది వాస్తవం అన్నారు. అణగారిన జాతుల హక్కుల కోసం ఆర్.కృష్ణయ్య చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నాను. ఆయన పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఎన్నికలకంటే ముందే రిజర్వేషన్లు పెంచాలి:

స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామన్నారు. అన్నీ పార్టీలు మొదట బీసీలకు సముచిత స్థానం కల్పించి చూపించాలన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో మొట్ట మొదటి సారి ఓబీసీల కేంద్ర మంత్రుల సంఖ్య ఎక్కువ ఉన్నది నరేంద్ర మోడీ కేబినెట్ లోనే అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ప్రజలు ఆశీర్వదిస్తే మేము ఓబీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మోడీ ప్రకటన చేశారని గుర్తు చేశారు.

.


Similar News