తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు పూర్తి

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి.

Update: 2024-08-05 16:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. ఈ పరీక్షకు మొత్తం 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. 34,694 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 11,062 ఖాళీల భర్తీకి ఈ ఏడాది మే 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 20న ముగిసింది. 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అత్యధికంగా 1,61,745 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీకి 88,005, భాషా పండితులు 18,211, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు 11,996 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్​ 4 వ తేదీతో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిసింది. అయితే డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు పెంచింది. గతంలో జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ అభ్యర్థుల డిమాండ్ మేరకు ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించింది.   


Similar News