Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాజకుమారి
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా డా డాక్టర్ రాజకుమారి ని ప్రభుత్వం నియమించింది. నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఆమె, జనరల్ ట్రాన్స్‌ఫర్లలో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా డా డాక్టర్ రాజకుమారి ని ప్రభుత్వం నియమించింది. నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఆమె, జనరల్ ట్రాన్స్‌ఫర్లలో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇందిరాను గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు. ఇక ఇన్నాళ్ల పాటు పనిచేసిన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావును, యాదాద్రి భువనగిరి టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రమేశ్‌రెడ్డిని యాదాద్రి భువనగిరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ చేశారు.
ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్‌ను మహేశ్వరం టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా, మాజీ డీఎంఈ త్రివేణిని మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్‌దాస్‌ను నర్సంపేట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ చేయగా, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను నియమించాల్సి ఉంది. నగరంలోని మిగిలిన హాస్పిటళ్లలో పాతుకుపోయిన వారిని కూడా ఒకట్రెండు రోజుల్లో బదిలీ చేయనున్నట్టు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.
స్పౌజ్ కేసులనూ పక్కకు పడేశారు..
తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ నెల 20వ తేదీ నాటికి కౌన్సిలింగ్ ప్రక్రియను ముగిస్తామని అధికారులు తెలిపారు. అయితే పబ్లిక్ హెల్త్ విభాగం లో మాత్రం అంతా కన్ఫ్యూజన్ గానే కొనసాగుతున్నది. ఎన్నిసార్లు రివైజ్డ్ చేసినా, సీనియారిటీ లిస్ట్ తప్పుల తడకలగానే ఉన్నదని నర్సులు ఆరోపించారు. ఏకంగా స్పౌజ్ కేసులను పరిగణలోకి తీసుకోలేదని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లో వరలక్ష్మి అనే స్టాఫ్ నర్సు 27 అనుభవం తో పాటు స్పౌజ్ ఉన్నా, సీనియారిటీ లిస్టులో వెనక్కి నెట్టేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతానని స్పష్టం చేశారు. ఒక లిస్టులో తన పేరును రెండో నంబరు మీద మెన్షన్ చేసి, ఆ తర్వాత రివైజ్డ్ చేసిన విడుదల చేసిన సీనియారిటీ లిస్టులో 13 నంబరుపై పెట్టారని ఆమె మండిపడ్డారు. ఈమె ఒక్కరే కాకుండా మిగతా మరి కొంత మంది స్టాఫ్నర్సులూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు నర్సింగ్ అసోసియేషన్ కు చెందిన ఒకరు తెలిపారు.