రైతులకు రసీదులు వెంటనే ఇవ్వండి.. అధికారుల‌కు మంత్రి జూపల్లి సూచన

వ‌రి ధాన్యం కొనుగోళ్లలో రైతుల పట్ల అలసత్వం వహించరాదని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను హెచ్చ‌రించారు.

Update: 2024-05-06 14:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వ‌రి ధాన్యం కొనుగోళ్లలో రైతుల పట్ల అలసత్వం వహించరాదని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను హెచ్చ‌రించారు. సోమవారం పాన‌గ‌ల్ మండ‌ల కేంద్రంలో వ‌రి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని మంత్రి సంద‌ర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు, రైతులతో మంత్రి మాట్లాడారు.

ధాన్యం అమ్మిన రైతులకు రసీదులు వెంటనే ఇవ్వాలని, రైతల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా బుసిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉస్మాన్ నూతన రైస్ మిల్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.

Tags:    

Similar News