యూనిక్ మదుపరులకు చెల్లిస్తారా? ముంచుతారా?
ప్రభుత్వం నిషేదించిన గొలుసు కట్టు సంస్థలు కొత్త పేర్లతో మళ్లి వస్తున్నాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం నిషేదించిన గొలుసు కట్టు సంస్థలు కొత్త పేర్లతో మళ్లి వస్తున్నాయి. మనిసర్క్యూలేషన్ విధానంపై ఆర్బీఐ నిబంధనలు విధించినా గతంలో తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారిని మళ్లి దాని ఉబిలోకి లాగే ప్రయత్నాలు కొనసాగిస్తున్న బహళ జాతి సంస్థలు.. పాత చెల్లింపులను చేయకుండానే కొత్తగా పేరు మార్చుకుని డిపాజిట్ల సేకరణ చేస్తున్న వ్యవహరం బాధితుల అందోళనతో వెలుగు చూసింది.
భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును పొదుపు చేద్దామని ఎంఎన్‌సీ కంపెనీ యూనిక్‌లో పెట్టుబడి పెట్టిన పాలసీదారులు తమ డబ్బుల కోసం ఆ కార్యాలయం చుట్టు చక్కర్లు కొడుతున్నారు. పది సంవత్సరాలు ప్రిమియం రూపంలో చెల్లించిన మొత్తానికి రెండింతులు వస్తుందని వందలాది మంది ఏజంట్లు వేల మందిని సభ్యులుగా పెట్టుబడులు పెట్టించారు. రెండు దశాబ్ధాల కాలంగా తాము చెల్లించిన పైకానికి రెండింతలు వస్తుందని నమ్మి పెట్టుబడి పెట్టిన వారు యూనిక్ కార్యాలయం చుట్టు డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
2019 వరకు సంబంధిత సంస్థ పాలసీదారులకు డబ్బులు చెల్లించిన అప్పటి నుంచి మాత్రం ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో వారు లబోదిబోమంటున్నారు. 2019 లోనే యూనిక్ సంస్థ ట్రాంజక్షన్ కాస్తా విల్ నేస్ బిజినెస్‌గా మార్చారు. యూనిక్ సంస్థలో ప్రజలు పెట్టిన పెట్టుబడులను వారికి తెలియకుండానే విల్ నెస్ కంపెనికి మల్లించి, డబ్బులు చెల్లించిన ప్రిమియం దారులకు తిరిగి చెల్లించకుండా చెతులేత్తేశారు.
గట్టిగా అడిగిన వారికి, పోలిస్ స్టేషన్‌లలో పిర్యాదు చేసిన వారికి ఎజెంట్లు మద్యవర్తులుగా ఎంతో కొంత ముట్ట చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి గత నాలుగు సంవత్సరాలుగా తిప్పుతునే ఉన్నారు. ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే 3 వేల మంది సభ్యులకు రూ.15 కోట్ల మేర డిపాజిట్ దారులకు చెల్లించాల్సి ఉంది.
నిజామాబాద్ నగరంలోని కవితా కాంప్లెక్స్‌లో సంబంధిత సంస్థ కార్యాలయం వద్ద నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు డబ్బుల కోసం తిరుగుతున్నారు. ప్రజలచేత సభ్యులుగా చేర్పించిన ఏజంట్లు మోహం చాటేయగా కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది స్పందించడం లేదు. దాంతో లబ్దిదారులు ఫోన్ చేసినా ఉద్యోగులెవ్వరు ఫోన్ తీయడం లేదని, స్విచ్ ఆఫ్ అంటూ సమాదానం వస్తుందని బుధవారం సంస్థ కార్యాలయంకు వచ్చి అధికారులను నిలదీశారు.
నగరంలోని కవితా కాంప్లెక్స్‌లో దశాబ్ధం క్రితం గొలుసుకట్ట సంస్థను ఏర్పాటు చేశారు. పూణే కేంద్రంగా ఉన్న సంస్థలో సభ్యులను చేర్పించేందుకు సంబంధిత సంస్థ వందల మంది ఏజంట్లను రిక్రూట్ చేసింది. వారు పదేళ్లు ప్రీమియం చెల్లిస్తే అంతకు రెట్టింపు సొమ్ము ఇస్తామని చెప్పడంతో వేల మంది అందులో చేరారు.
చైన్ సిస్టంలో ఇతరులను చేర్పించడం ద్వారా లబ్దిపొందే ప్రక్రియ ఉండడంతో అందులో చాలా మందిని, ఇరుగుపొరుగు వారిని కూడా చేర్పించారు. డబ్బులు విషయంలో బాండ్లను ఇచ్చి ప్రతి నెల ప్రీమియంలను కట్టించుకున్నారు. 2019 వరకు సంబంధిత సంస్థ కొద్దొగొప్పగా అందరికీ డబ్బులను సెటిల్ చేసింది.
కానీ కరోనా సాకు చూపెట్టి అప్పటి నుంచి రేపుమాపు అంటూ తిప్పుతుండడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. లబ్దిదారుల నుంచి బాండ్లను తీసుకుని కార్యాలయానికి మెయిల్ చేశాం. డబ్బులు వస్తాయని దాటవేత దోరణి అవలంభిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇదే తంతు ఉండడంతో లబ్దిదారులు కార్యాలయం, సిబ్బంది అధికారులపై మండిపడుతున్నారు.
కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సెకరించిన సోమ్ముతో నిజామాబాద్‌లో కొన్ని స్థిరాస్థులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఐతే డిపాజీట్ చేసిన ప్రజలనుంచి వస్తున్న ఒత్తిడితో కొందరు ఎజెంట్లు గుట్టు చప్పుడు కాకుండా సంబంధిత అస్తులను అమ్మడానికి యత్నించిన వ్యవహరం బయటకు రావడం అందోళనకు కారణం.
జిల్లా కేంద్రంగా ఎంఎన్‌సి కంపెనీ పేరిట గత నాలుగేళ్లుగా అందులో డబ్బులను ప్రీమియం రూపంలో నెలవారి చెల్లింపులు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండానే కొత్తగా మళ్లీ దందా నిర్వహిస్తుండడం లబ్దిదారుల ఆగ్రహానికి కారణమైంది. నిజామాబాద్ నగరంలోని 3వ కల్లుడిపో నిర్వాహకుడు అందులో ప్రధాన ఎజెంట్‌గా పెత్తనం చేస్తూ నిర్వాహణ బాధ్యతలు చేపట్టడంపై మండిపడుతున్నారు.
కృత్రిమ కల్లు తయారితో కుడ బెట్టిన కల్లు సొత్తును పెట్టుబడి పెట్టి ప్రజలను డబ్బుల కోసం వస్తే వేదిస్తున్నారంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిషేదించిన గొలుసుకట్టు సంస్థ పేరుతో మళ్లీ 5 వేల నుంచి 10 వేల పెట్టుబడి పదేళ్లలో మీ రాబడి రెట్టింపు అంటూ కొత్తగా వసూల్ చేయడంపై మండిపడ్డారు. ఐడికార్డు లాంటిది జారీ చేస్తూ ఏజెంట్లను రిక్రూట్ చేస్తూ ఇప్పటికే కొత్తగా ఎంఎన్‌సిలో పెట్టుబడి పెట్టాలని ప్రచారం చేయడాన్ని ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టిన లబ్దిదారులు కార్యాలయానికి వచ్చి నిత్యం మండిపడటం సర్వసాధారణం అయింది.
వేల మంది సభ్యుల వద్ద కోట్ల రూపాయలను తీసుకుని బాండ్లను అప్పజెప్పిన సంస్థ మళ్ళీ కొత్తగా మార్కెట్లో వెళ్లడంపై పాత లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా యూనిక్ సంస్థ పేరును మార్చి రకరకాలుగా నెట్ వర్క్‌ను క్రియేట్ చేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మోసపోవద్దని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పాత కేసులే పెండింగ్‌లో ఉన్నాయని లబ్దిదారులు, నిర్వాహకుల మధ్య ఒప్పందం ఉందని దాటవేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెట్టుబడి పెట్టిన వారి డబ్బులు తిరిగి చెల్లిస్తారా? లేక ఎంఎన్‌సి ముంచుతుందా? అనే చర్చ జోరుగా సాగుతుంది. గతంలొ పోలిస్ కేసులు నమోదు చేయిస్తే సెటిల్ చేస్తామని కొందరిని, ఎదురు తిరిగిన వారిపై పోలీస్‌లతో బలవంతంగా కేసులు నమోదు చేయించిన దాఖలాలు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. గతంలో కుదిరిన ఒప్పంధం మేరకు డిపాజిట్లు చెల్లించిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలని లేకపోతే అందరం కలిసి అందోళన చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.