రోడ్డు ప్రమాదాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతాయో తెలుసా?

మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2023-05-08 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాక్సిడెంట్ల వల్ల రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలపై అధికారులు ప్రజలకు.. భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు చేస్తూ.. వాహనాదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినా కూడా ఈ రోడ్డు యాక్సిడెంట్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

అయితే తెలంగాణలో ఏ సమయాల్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయనే దానిపై ఆరా తీసిన అధికారులు 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు ప్రకారం.. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని నిర్ధారించారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు, పనులు ముగించుకున్న ఉద్యోగులు, ఇతర పనులపై ప్రజలు రహదార్లపైకి ఎక్కువగా రావడం వల్ల ఆక్సిడెంట్ల సంఖ్య రోజురోజుకు అధికంగా పెరుగుతున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News