చేపల వేటకు వెళ్లవద్దు : ఫిషరీస్ చైర్మన్ ఆదేశం

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితం కావాలని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.

Update: 2024-09-01 15:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితం కావాలని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఊహించని స్థాయిలో వరదలు వస్తున్నాయని, మత్స్యకారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు హెచ్చరికలు జారీ అయ్యాయని గుర్తు చేశారు. దీంతో పాటు రిస్క్ టీమ్స్ కూడా రెడీగా ఉండాలని ఆయన అన్ని జిల్లాలకు సూచించారు. అలుగుపడుతున్న వరదలోకి ఎవరినీ పంపవద్దని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.


Similar News