చంద్రబాబు సంచలన నిర్ణయం.. తెలంగాణలో అన్ని టీడీపీ కమిటీలు రద్దు
తెలంగాణ పార్టీ బలోపేతంపై టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పార్టీ బలోపేతంపై టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పార్టీ జిల్లా, మండల కమిటీలు అన్నీ రద్దు చేశారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనతో పాటు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ముందు సభ్యత్వాలపై ఫోకస్ చేయాలని ముఖ్య నేతలను చంద్రబాబు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని సూచించారు. ఎక్కువ సభ్యత్వాలు చేసిన నేతలకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇకపై ప్రతినెలలో రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని బాబు హామీ ఇచ్చారు.
Read More..