'డిజిటల్ మీడియాలో 'దిశ' కొత్త ఒరవడి'

అనతి కాలంలోనే దిశ దినపత్రిక ప్రజలకు చేరువై ప్రజాదరణ పొందిందని బిజినేపల్లి తహసీల్దార్ అంజిరెడ్డి అన్నారు.

Update: 2023-01-03 08:29 GMT

దిశ, బిజినేపల్లి : అనతి కాలంలోనే దిశ దినపత్రిక ప్రజలకు చేరువై ప్రజాదరణ పొందిందని బిజినేపల్లి తహసీల్దార్ అంజిరెడ్డి అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో దిశ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'దిశ' పేపర్ డిజిటల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ సమాజానికి అద్దం అని నిష్పక్షపాతంగా వార్తలను ప్రచారం చేయడం ద్వారా సమాజాన్ని లోతుగా ప్రభావితం చేయగలదన్నారు. డిజిటల్ మీడియాలో ఒక సరికొత్త ఒరవడిని దిశ సృష్టించిందన్నారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్‌తో తాజా వార్తలు ప్రచురిస్తూ పాఠకుల మన్ననలు పొందుతోందన్నారు.

వాస్తవిక కథనాలను అందిస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందిందన్నారు. నేడు ఈ పత్రికా రంగంలో నూతన ఒరవడితో అనతి కాలంలోనే తాజా సమాచారాన్ని అందించే పత్రికల్లో దిశ పత్రిక ఒకటని పేర్కొన్నారు. 'దిశ' మరింతగా ప్రజల మన్ననలు పొందాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీఎస్పీ మండల అధ్యక్షులు రామచందర్, మండల ఉప తహసీల్దార్ రాజ్ కుమార్ ,ఆర్ఐ బాలరాజు, సీనియర్ అసిస్టెంట్ భారతి, జూనియర్ అసిస్టెంట్ అనురాధ, కంప్యూటర్ ఆపరేటర్లు నరేష్, కళ్యాణ్, కృష్ణవేణి, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు సలేశ్వరం, శేఖర్, నజీర్, నరేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News