అక్టోబర్ 14న రహదారులపై రాస్తారోకో.. ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు

టీఎస్‌పీఎస్సీ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు

Update: 2023-10-12 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకుటీఎస్‌పీఎస్సీ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకుటీఎస్‌పీఎస్సీ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు అక్టోబర్ 14న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని నిర్ణయించినట్టు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రో .కోదండరాం వెల్లడించారు. గురువారం అఖిలపక్ష పార్టీల రాస్తారోకోకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారికి టీజేఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్లు రవి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల,నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయని తెలిపారు.

ఈ మేరకు గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, పి డి ఎస్ యూ , ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. అక్టోబర్ 14న ఉదయం 10.30 గంటల నుండీ 12.30 వరకూ జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరుతున్నామన్నారు.

అక్టోబర్ 14 రాస్తారోకో పాయింట్స్

1.మహబూబ్ నగర్ నుండీ హైదరాబాద్ రహదారిలో మహబూబ్ నగర్,జడ్చర్ల, షాద్ నగర్,శంషాబాద్

2.వరంగల్ నుండీ హైదరాబాద్ రహదారి పై వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘటకేశ్వర్,

3.రామగుండం నుండీ హైదరాబాద్ రహదారిపై రామగుండంపెద్దపల్లి,కరీం నగర్,సిద్దిపేట, గజ్వేల్, శామీరు పేట, తూంకుంట

4. ఖమ్మం నుండీ హైదరాబాద్ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్

అక్టోబర్ 14 రాస్తారోకో డిమాండ్లు

1.ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా టి ఎస్ పి ఎస్ సి సభ్యులను తొలగించి ,టి ఎస్ పి ఎస్ సి చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి.

2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.

3. డి ఎస్ సి పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.(బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )

4.పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు .


Similar News