అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ధర్నా
పార్లమెంట్ లో అంభేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం గా మారాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్(Parliament)లో అంభేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం గా మారాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియా కూటమి(Alliance of India), కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని అసెంబ్లీలో, రాష్ట్ర రాజధానుల్లో నిరసనలకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం(Assembly premises)లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా(Dharna) నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా అంబేద్కర్(Ambedkar) పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదో తెలపాలని అన్నారు. టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్త్‌రఫ్(Birthrough) చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.