DH Post: రెగ్యులర్ డీహెచ్ పోస్టు ప్రాసెస్ షురూ.. ఐదుగురితో సీనియారిటీ లిస్ట్

రెగ్యులర్ డీహెచ్ పోస్టు నియామకాన్ని సర్కార్ స్పీడప్ చేసింది.

Update: 2024-08-22 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెగ్యులర్ డీహెచ్ పోస్టు నియామకాన్ని సర్కార్ స్పీడప్ చేసింది.ఈ మేరకు ఐదుగురు అధికారులతో సీనియారిటీ లిస్టు తయారు చేశారు. ఆయా అడిషనల్ డైరెక్టర్ల సర్వీస్, రిటైర్మెంట్ వివరాలను వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి పంపించింది. ఒకరిని సెలెక్ట్ చేసి ప్రభుత్వం అతి త్వరలో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నది. అయితే ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను కూడా ప్రభుత్వానికి తెలపవచ్చు. సీనియారిటీ లిస్టులో డాక్టర్ రవీందర్ నాయక్, డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, డాక్టర్ మోజిరామ్ రాథోడ్, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఆర్.పుష్ప ఉన్నారు. వీరిలో ఇప్పటికే రవీందర్ నాయక్ ఇన్‌చార్జి డీహెచ్‌గా కొనసాగుతున్నారు.

సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ డీహెచ్‌గా ఆయన్నే నియమించే చాన్స్ ఉందని ఉద్యోగులు చెప్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో డీహెచ్ పరిధిలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉన్నది. పోస్టింగుల అంశంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వర్గాలు కూడా రిపోర్టులు అందజేసినట్లు తెలిసింది. కానీ, ఇప్పటి వరకు డ్యామేజ్ చర్యలేవీ తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపాదికన కాకుండా సమర్థత కలిగిన ఆఫీసర్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన రూల్స్‌ను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా, వైరల్‌ జ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయి.

DH Post: రెగ్యులర్ డీహెచ్ పోస్టు ప్రాసెస్ షురూ.. ఐదుగురితో సీనియారిటీ లిస్ట్వాటి కట్టడిలో ప్రస్తుత ఇంచార్జి డీహెచ్ పూర్తిగా వైఫల్యం చెందారని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఆయన క్షేత్రస్థాయిలో పని చేయనందునే ఆ పరిస్థితి ఉన్నట్లు కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి వివరించారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత డీహెచ్ పోస్టు ఏపీకి వెళ్లిపోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఇంచార్జి పోస్టుతోనే నెట్టుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే డీహెచ్, టీవీవీపీ, డ్రగ్ కంట్రోల్ పోస్టులను క్రియేట్ చేసి, ఇందుకు సమర్థవంతమైన ఆఫీసర్లను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

Tags:    

Similar News