అగ్నిమాపక సిబ్బందికి డీజీపీ నాగిరెడ్డి కీలక ఆదేశం..

Update: 2023-03-15 17:07 GMT

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో సిబ్బంది అందరూ అలర్ట్‌గా ఉండాలని అగ్నిమాపక శాఖ డీజీపీ నాగిరెడ్డి సూచించారు. వేసవి ముగిసేవరకు సిబ్బంది సెలవులపై వెళ్లవద్దని చెప్పారు. తన కార్యాలయంలో అగ్ని ప్రమాదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు, కెమికల్ ఇండస్ట్రీలు, స్క్రాప్ గోడౌన్ లలో తనిఖీలు జరపాలని ఆదేశించారు. దాంతోపాటు ఆస్పత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదల నివారణకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో చూడాలని చెప్పారు. ఎలక్ట్రికల్ సేఫ్టీపై దృష్టి పెట్టాలని చెప్పారు.

ప్రతీ శుక్రవారం స్కూళ్లు, హాస్పిటళ్లలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెక్యూరిటీ గార్డులు, ఆస్పత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు, థియేటర్ల సిబ్బందికి ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలన్న దానిపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. జీహెచ్ ఎంసీ, వాటర్ వర్క్స్ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రమాదాల సమయంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నీళ్ల పాయింట్లు ఉన్నాయో గుర్తించాలని సూచించారు.

Tags:    

Similar News