Etala : బీజేపీతోనే గిరిజనుల అభివృద్ధి : జార్ఖండ్ లో ఈటల

బీజేపీతోనే బీసీ, దళిత, ఆదివాసీ, గిరిజన సమగ్రాభివృద్ధి సాధ్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు

Update: 2024-11-15 07:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP)తోనే బీసీ, దళిత, ఆదివాసీ, గిరిజన(tribals) సమగ్రాభివృద్ధి సాధ్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్( Etala Rajender)అన్నారు. గిరిజన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జార్ఖండ్ రాంచీ పట్టణంలో ఆయన విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. భారతదేశంలో గిరిజనుల గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహకారాన్ని ప్రతిభించేలా “జన జాతీయ గౌరవ్ దివస్“ ను బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతియేడు నిర్వహించడం గర్వకారణమన్నారు. గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈటల అన్నారు.

దేశ చరిత్రలోనే వాజ్ పేయ్ హయాంలో గిరిజన సంక్షేమ శాఖను బీజేపీ ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందని, గిరిజనుల పథకానికి రూ.24 వేల కోట్లు కేటాయించిందన్నారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌, పీఎం జన్ మన్ ధరి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌’ వంటి పథకాలు అమలు చేస్తున్నారరన్నారు. తెలంగాణలో 900కోట్లతో సమ్మక్క, సారక్క ములుగు గిరిజన యూనివర్సటీని ఏర్పాటు చేస్తున్నారని ఈటల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ భాటియా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, జార్ఖండ్ బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..