Deputy CM Bhatti: ఆ విషయాలు అందరితో పంచుకోవాలనేదే మా తాపత్రయం

సింగరేణి సంస్థను అన్ని రంగాల్లోకి విస్తరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2025-01-07 15:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థను అన్ని రంగాల్లోకి విస్తరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థ గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా రూపొందించిన 2025 కొత్త సంవత్సర క్యాలెండర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ సంస్థ విశిష్టతను మాత్రమే కాకుండా, ఉద్యోగుల శ్రేయస్సు కోసం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందరితో పంచుకోవాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను అన్ని రంగాల్లోకి విస్తరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, సంస్థ ఆధ్వర్యంలో అనేక వినూత్న కార్యాచరణలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

కేవలం బొగ్గు ఉత్పత్తుల వరకు మాత్రమే పరిమితం కాకుండా సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ రంగం, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ తదితర రంగాల్లోకి విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సంక్షేమాన్ని, గత ఏడాదిగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో క్యాలెండర్‌ను రూపొందించినట్లు సీఎండీ ఎన్.బలరామ్ డిప్యూటీ సీఎంకు వివరించారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగులందరికీ ఈ క్యాలెండర్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం కో-ఆర్డినేషన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుభానీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News