అందుకే భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం: డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీంచాలరు.

Update: 2024-09-02 14:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీంచాలరు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారీ వర్షాలపై ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని తెలిపారు. అందుకే ప్రాణనష్టాన్ని నివారించగలిగామని అన్నారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిత్యం సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అంచనాకు అందని విధంగా వర్షాలు పడ్డాయని అన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో భారీ నష్టం ఏర్పడిందని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో ఈ స్థాయి వర్షాలు గతంలో ఎన్నడూ పడలేదని అన్నారు. కాగా, ఖమ్మం పట్టణ సమీపంలోని నాయకనిగూడెంలో దెబ్బతిన్న వంతెనను, రోడ్డును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అవసరమైన మరమ్మతులను ప్లాన్ చేయండని అధికారుల‌ను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉప్పొంగిన ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించారు. అలాగే పాలేరు ఎడమ కాలువను కూడా పరిశీలించారు. భారీ వరద నీరు కార‌ణంగా దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను పరిశీలించారు.


Similar News