బిల్డర్స్ తో డిప్యూటీ సీఎం భట్టి..ఉత్తమ్ ల భేటీ

రాష్ట్రంలోని బిల్డర్స్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సచివాలయంలో భేటీ అయ్యారు

Update: 2024-10-16 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని బిల్డర్స్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సచివాలయంలో భేటీ అయ్యారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన క్రమంలో సాగుతున్న కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, బిల్డర్లు అభద్రతలో ఉన్నారన్న విమర్శల నేపథ్యంలో బిల్డర్లతో భట్టి, ఉత్తమ్ లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేసే కార్యాచరణలో భాగంగా బిల్డర్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా భట్టి తెలిపారు. బిల్డర్లతో సమావేశంలో వారి సమస్యలు తెలుసుకుని నగర ప్రగతిలో కీలకంగా ఉన్న నిర్మాణ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన చేయూతనందిస్తామన్నారు. సమావేశం పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

కాగా బిల్డర్లను, ప్రజలను బెదిరించి వసూళ్ల కోసమే హైడ్రాను ఉపయోగిస్తున్నారని, రియ‌ల్ ఎస్టేట్ దివాలా తీసిందని, రిజిస్ట్రేష‌న్ రెవెన్యూ ప‌డిపోయిందని, మూసీ పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన క్రమంలో బిల్డర్ల సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 


Similar News