రాష్టంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం.. వంద రోజుల్లో ప్రజలకు సేవకులుగా సీఎం, డిప్యూటీ సీఎం: టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి

బానిస పాలన ప్రజలకు విముక్తి లభించిందని, తద్వారా రాష్టంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.

Update: 2024-03-17 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బానిస పాలన ప్రజలకు విముక్తి లభించిందని, తద్వారా రాష్టంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. రాష్టాల్లో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి వంద రోజుల్లో ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజలకు సేవకులుగా పని చేస్తూ నిజమైన స్ఫూర్తిని నింపారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పునరుద్ధరించబడిందని తెలిపారు. తెలంగాణ మోడల్ ప్రభుత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందన్నా ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మంత్రులతో సహా వివిధ ప్రభుత్వ పదవులలో అందరికీ సామజిక న్యాయం పాటించామని తెలిపారు. అదేవిధంగా సామూహిక నాయకత్వంతో నిర్ణయాలు తీసుకుంటూ సమ్మిళిత వృద్ధి దిశగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అమలు చేశామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామని అన్నారు. ధరణి సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తునన్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సీఎం, మంత్రులు, అధికారులను కలిసి తమ సమస్యలు తెలిపేందుకు తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని మల్లు రవి తెలిపారు. 

Tags:    

Similar News