‘TS జెన్కో ఏఈ ఎగ్జామ్ వాయిదా వేయాలి’.. సీఎం రేవంత్ రెడ్డికి బక్క జడ్సన్ రిక్వెస్ట్

టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ వెంటనే పోస్ట్ పోన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ రిక్వెస్ట్ చేశారు. ఇవాళ

Update: 2023-12-11 12:51 GMT

దివ, డైనమిక్ బ్యూరో: టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ వెంటనే పోస్ట్ పోన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ రిక్వెస్ట్ చేశారు. ఇవాళ ఆయన దగ్గరికి ఏఈకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వచ్చి కలిసిశారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని వీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారని అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పోలీసులు అనుకోవడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఏఈ పరీక్ష నిర్వహించే తేదీల్లో ఇతర సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్నాయని, మరోవైపు ఎన్నికల సమయంలో సరిగ్గా సిలబస్‌పై విద్యార్థులు దృష్టిపెట్టలేదని.. ఈ నేపథ్యంలోనే ఏఈ ఎగ్జామ్‌ను వెంటనే వాయిదా వేయాలని మన బిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. పేపర్ లీకులు కారణంగా బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ప్రభుత్వంలో ఉన్న కార్పోరేషన్లు, అడ్వైజరీ లను రద్దు చేసినట్లు.. ఈ జెన్కో నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలన్నారు. 

Tags:    

Similar News