ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించింది.

Update: 2024-04-05 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. విచారణకు అవకాశం ఇవ్వాలని శుక్రవారం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. ప్రశ్నించే ముందురోజు కోర్టును సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది. కవితను ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు గదిలో ఉండాలని షరతు విధించింది. అంతేకాదు.. ప్రశ్నించే సమయంలో ల్యాప్‌టాప్, ఇతర స్టేషనరీ సమాన్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 8వ తేదీన కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గురువారం ఈడీ, కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. కాగా, మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 16న కోర్టులో హాజరు పర్చగా.. కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారు.

Tags:    

Similar News