ఆమె మరణ వార్త విన్నందుకు చాలా బాధపడ్డాను: మాజీ మంత్రి కేటీఆర్

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కికీ అనారోగ్యంతో మృతి చెందారు. 56 ఏళ్ల ఆమె.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-08-11 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కికీ అనారోగ్యంతో మృతి చెందారు. 56 ఏళ్ల ఆమె.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గూగుల్ ఉద్యోగులలో ఒకరిగా నిలిచిన సుసాన్ 2014లో YouTube CEO అయ్యారు. కాగా సుసాన్ వోజ్‌కికీ మృతిపై తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. తన ట్వీట్‌లో " డైనమిక్ సుసాన్ వోజ్‌కికీ, యూట్యూబ్ మాజీ CEO మరణవార్త విన్నందుకు చాలా బాధపడ్డాను. ఈ విషాద సందర్భంలో సుసాన్ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నారు. అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రాసుకొస్తూ.. గతంలో సుసాన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.


Similar News