Deadly kite : ప్రాణాంతకమైన పతంగి మాంజా..ఒకరికి తీవ్ర గాయాలు
పతంగి మాంజా(Kite Manja) ఎంత ప్రాణాంతకమో మరోసారి రుజువైంది.
దిశ, వెబ్ డెస్క్ : పతంగి మాంజా(Kite Manja) ఎంత ప్రాణాంతకమో మరోసారి రుజువైంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా(China Manja) ధారం దారిన వెలుతున్న ద్విచక్ర వాహనదారు(Bicyclist)డి మెడకు చుట్టుకోవడంతో అతని మెడ తెగి(Neck Cut) తీవ్ర రక్తస్రావమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానికులు కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికి మార్కెట్ లో అది విరివిగా దొరుకుతుంది. చైనా మాంజాపై అవగాహాన లేని పిల్లలు దానిని కొనుగోలు చేస్తూ పతంగులు ఎగరేసేందుకు వాడుతున్నారు. చైనా మాంజా ధారాలు తగిలి గతంలోనూ వివిధ చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. పక్షులకు గాయాలు, మరణాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరేసే వారు చైనా మాంజా ధారం వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.