Danam Nagender: ఇలాంటివి హరీష్ రావు ప్రోత్సహించొద్దు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు.

Update: 2024-09-13 11:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. కావాలనే బీఆర్ఎస్(BRS) నేతలు ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేదా? పార్టీ స్టాండా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతమైతే తక్షణమే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి అరికెపూడి గాంధీ(Arekapudi Gandhi) ఇళ్లే దొరికిందా? అని అడిగారు. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలే రెచ్చగొడుతున్నారని అన్నారు. హరీష్ రావు(Harish Rao) కూడా ఇలాంటి సంస్కృతిని ప్రొత్సహించొద్దని సూచించారు. మహిళల శక్తి ఏంటో పాడి కౌశిక్ రెడ్డికి తెలిసేలా చేస్తామని అన్నారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. తాము అన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు.


Similar News