Alert: లింక్క్లిక్చేశారో.. ఖాతా ఖాళీ కావటం ఖాయం
బ్యాంక్కస్టమర్కేర్సర్వీస్ ప్రతినిధినంటూ ఏదైనా మీ ఫోన్లైన్లోకి వచ్చాదా? లింక్పంపిస్తున్నా మీ ఖాతా వివరాలను అప్డేట్చేయండని ఎవరైనా చెప్పారా? ఒక్క క్షణం ఆలోచించండి.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బ్యాంక్కస్టమర్కేర్సర్వీస్ ప్రతినిధినంటూ ఏదైనా మీ ఫోన్లైన్లోకి వచ్చాదా? లింక్పంపిస్తున్నా మీ ఖాతా వివరాలను అప్డేట్చేయండని ఎవరైనా చెప్పారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచించకుండా లింకుపై క్లిక్‌చేసి మీ అకౌంట్వివరాలను అప్ లోడ్ చేశారో? అంతే సంగతులు. క్షణాల్లో మీ ఖాతాలోని డబ్బు మాయం కావటం ఖాయం. మీ ఖాతా బ్లాక్ కూడా అవుతోంది. వెంటనే మేం పంపించిన లింకుపై క్లిక్‌చేసి పాన్‌కార్డు ఇతర వివరాలను అప్గ్రేడ్చేయండని మొబైల్‌కు మెసేజీ వచ్చినా వెంటనే అలర్ట్అవండి. అలా కాకుండా కంగారులో వచ్చిన లింకును క్లిక్చేశారో.. చేజేతులా మీ డబ్బును మీరే పోగొట్టుకున్నవారు అవుతారు. ఎక్కడో వందలు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉండి రకరకాల మార్గాల్లో జనం డబ్బును దోచుకుంటున్న సైబర్‌నేరగాళ్లు ఇటీవలిగా తరచూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. వందలు.. వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. జరుగుతోంది మోసం అని గ్రహించే లోపే ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేసేస్తున్నారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఒకవేళ నిందితులు పట్టుబడినా చాలాసార్లు వాళ్లు కొల్లగొట్టిన డబ్బులో పదో శాతం కూడా రికవరీ కావటం లేదు.
దేశవ్యాప్తంగా సాంప్రదాయ నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా సైబర్‌నేరాలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పెట్టుబడులు, వర్క్‌ఫ్రం హోం, వ్యాపార అవకాశాలు, పార్ట్‌టైం ఉద్యోగాలు, రేటింగ్ఫ్రాడ్స్టర్లు, బ్యాంక్ఎగ్జిక్యూటీవ్ల పేర సైబర్‌నేరగాళ్లు నిత్యం జనాన్ని లూటీ చేస్తున్నారు. మరికొందరు హనీ ట్రాప్‌లు చేస్తూ బ్లాక్మెయిలింగ్చేయటం ద్వారా డబ్బు గుంజుతున్నారు. దీని కోసం వాట్సాప్, టెలిగ్రామ్ తదితర యాప్‌లను ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంఘడ్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, జార్ఖండ్‌లోని జామ్తారా, దియోఘర్, పశ్చిమ బంగలోని అసన్సోల్, దుర్గాపూర్, అస్సాంలోని బర్పేట్, దుబ్రీ, గోల్పార, పారెగావ్, నగాడ్, బిహార్‌లోని బంకా, బెగుసరాయ్, జముయ్, నవాడ, నలార, గయా, ఢిల్లీలోని అశోక్‌నగర్, ఉత్తమ్‌నగర్, శక్కర్పూర్, హర్కేశ్నగ, ఓక్లా, ఆజాద్‌పూర్, హర్యానాలోని మేవత్, భివానీ, నూహ్, పల్వల్, మనాట, హసన్పూర్, హతన్గావ్కేంద్రాలుగా చేసుకొని సైబర్క్రిమినల్స్విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారు.
ఒకే భవనంలో..
పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఆజంఘడ్‌లో ఒకే భవనంలో, ఒక్కో క్యూబ్‌లో ఒక్కో పేరుతో మొత్తం 3వేల కంపెనీలు నడుపుతున్నట్టు తెలిసింది. వీళ్లలో చాలామంది వేర్వేరు బ్యాంకుల కస్టమర్కేర్సర్వీస్పేరిట సెర్చ్ఇంజన్లలో పేజీలు క్రియేట్చేసి పెట్టినట్టు సమాచారం. ఎవరైనా అవసరమై కస్టమర్కేర్నెంబర్కోసం సెర్చ్ఇంజన్లో సెర్చ్‌చేస్తే ఈ సైబర్‌నేరగాళ్ల మొబైల్నెంబర్లు ప్రత్యక్షమవుతున్నాయి. నిజమైనవే అనుకుని ఫోన్‌చేస్తే అవతలి నుంచి చక్కటి ఇంగ్లీషులో మీకు ఎలా సాయపడగలమంటూ మొదలుపెట్టి సైబర్‌నేరగాళ్లు అవతలి వారిని నైస్‌గా ఉచ్ఛులోకి లాగుతున్నారు. ముందు సమాచారం తీసుకుని మీకో లింక్పంపిస్తున్నాం.. వివరాలు అప్లోడ్చేయండంటూ బ్యాంక్‌ఖాతా వివరాలు, కేవైసీ, ఓటీపీ నెంబర్లు, డెబిట్, క్రెడిట్‌కార్డులు ఇన్ఫర్మేషన్తీసుకుంటున్నారు. ఒక్కసారి ఈ వివరాలను అవతలివారు పంపిన లింకును క్లిక్‌చేసి అప్లోడ్చేయగానే క్షణాల వ్యవధిలో ఖాతాల్లో నుంచి లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. దీనికి తాజా నిదర్శనంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో పని చేస్తున్న శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఎస్బీఐ అలకాపురం బ్రాంచ్స్విఫ్ట్కోడ్తెలుసుకునేందుకు కస్టమర్కేర్కోసం సెర్చ్ఇంజన్లో సెర్చ్‌చేసిన ఆయన అక్కడ కనిపించిన నెంబర్‌కు ఫోన్‌చేశారు. అవతలి వ్యక్తి పంపించిన లింకును క్లిక్‌చేసి అడిగిన వివరాలను అప్‌లోడ్‌చేశారు. 24 గంటల్లో మీ మొబైల్‌కు స్విఫ్ట్కోడ్వాట్సాప్లో వస్తుందని చెప్పి అవతలి వ్యక్తి ఫోన్‌పెట్టేశాడు. స్విఫ్ట్కోడ్రాలేదుగానీ రెండు విడతల్లో ఆయన ఖాతాలో నుంచి 8 లక్షల రూపాయలను సైబర్క్రిమినల్స్కొట్టేశారు. అప్పుడుగానీ మోసపోయినట్టు గ్రహించిన శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఎల్బీనగర్సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అకౌంట్ బ్లాక్..
ఇక, జనం నుంచి డబ్బు కొల్లగొట్టటానికి ఇటీవలిగా సైబర్క్రిమినల్స్మరో కొత్త దారి కని పెట్టుకున్నారు. దాని ప్రకారం మీ ఖాతా ఈ రోజు బ్లాక్అవుతోంది.. అలా జరగకుండా ఉండాలంటే నెట్‌బ్యాంకింగ్‌కు మీ పాన్‌కార్డు వివరాలను అప్గ్రేడ్చేయండి అని పేర్కొంటూ లింకును మెసేజ్చేస్తున్నారు. అయ్యో.. అకౌంట్బ్లాక్అవుతోందా? అన్న కంగారులో ఎవరైనా ఆ లింకును క్లిక్‌చేసి అడిగిన వివరాలను అప్‌లోడ్‌చేసిన వెంటనే వారికి సంబంధించిన ఖాతాల్లోని డబ్బును ఊడ్చేస్తున్నారు.
ఏ బ్యాంకు అడగదు..
ఏ జాతీయ బ్యాంకు కూడా ఖాతాదారులను ఆన్లైన్లో కేవైసీ, ఓటీపీ, డెబిట్, క్రెడిట్, ప్యాన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలను అప్గ్రేడ్చేయండని అడగదని ఎస్బీఐ బ్యాంక్సీనియర్ఉద్యోగి శ్రీనివాస్చెప్పారు. కస్టమర్కేర్సర్వీస్కావాలనుకుంటే సెర్చ్ఇంజన్లలో అస్సలు సెర్చ్చేయవద్దని ఆయన సూచించారు. డెబిట్, క్రెడిట్కార్డులపై, బ్యాంకు పాస్‌బుక్కుల్లో కస్టమర్కేర్టోల్ఫ్రీ నెంబర్లు ఉంటాయని, వాటికి మాత్రమే ఫోన్‌చేయాలని చెప్పారు. ఇదే విషయమై అమితాబ్బచ్చన్లాంటి స్టార్సెలబ్రెటీలతో ప్రకటనలు తయారు చేయించి విస్తృతంగా ప్రచారం చేసినట్టుగా తెలిపారు. అయినా, చాలామంది సైబర్‌నేరగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుని డబ్బు పోగొట్టుకుంటున్నారన్నారు.