సైబరాబాద్ పోలీసుల పెద్ద మనసు.. హోంగార్డు కుటుంబానికి రూ.11.60 లక్షల ఆర్థిక సాయం
సైబరాబాద్ పోలీసులు పెద్ద మనసు చాటుకున్నారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పిలుపు మేరకు తలా ఓ చేయి వేసి విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ పోలీసులు పెద్ద మనసు చాటుకున్నారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పిలుపు మేరకు తలా ఓ చేయి వేసి విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. తోచినంతగా విరాళం ఇచ్చి మొత్తం 11లక్షల అరవై వేల రూపాయలను జమ చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం కమిషనర్స్టీఫెన్రవీంద్ర తన కార్యాలయంలో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి అందచేశారు. దీనిపై ఆ హోంగార్డు కుటుంబం కృతజ్ఞత వ్యక్తం చేయగా.. ఇన్నాళ్లకు మమ్మల్ని ఓ ఆఫీసర్గుర్తించారని హోంగార్డులు అంటున్నారు.
మేడ్చల్ట్రాఫిక్పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జీ.శ్రీనివాస్జనవరి 25న కండ్లకోయ జంక్షన్‌లో డ్యూటీలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటం.. కుటుంబం నిరుపేదది కావటంతో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్న సైబరాబాద్కమిషనర్స్టీఫెన్రవీంద్ర ఉన్నతాధికారుల నుంచి దీని కోసం అనుమతి తీసుకున్నారు.
అనంతరం తోచినంత మొత్తాన్ని శ్రీనివాస్ కుటుంబానికి విరాళంగా ఇవ్వాలని కమిషనరేట్పరిధిలోని సిబ్బందికి పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన సిబ్బందితో పాటు సీఎస్సార్కార్పోరేట్సెక్టార్ ఉద్యోగులు కలిసి 11లక్షల అరవై వేల రూపాయలను జమ చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం కమిషనర్స్టీఫెన్రవీంద్ర తన కార్యాలయంలో శ్రీనివాస్భార్యకు అందచేశారు.
ఇక, శ్రీనివాస్‌కు హెచ్డీఎఫ్సీబ్యాంక్లో సాలరీ అకౌంట్ఉన్న నేపథ్యంలో సదరు బ్యాంక్అధికారులతో కూడా కమిషనర్స్టీఫెన్రవీంద్ర మాట్లాడారు. శ్రీనివాస్‌కు ఇన్సూరెన్స్ మొత్తంగా రావాల్సిన 30లక్షల రూపాయలను కూడా అతని కుటుంబానికి ఇప్పించారు. ఇక, మేడ్చల్ట్రాఫిక్పోలీస్స్టేషన్ఇన్స్పెక్టర్బీఎన్ఎస్.రెడ్డి సంవత్సరంపాటు శ్రీనివాస్ తల్లికి ప్రతీనెలా రెండున్నర వేల రూపాయలు ఆర్థిక సాయంగా ఇవ్వటానికి ముందుకొచ్చారు.
మానవత్వంతో స్పందించి శ్రీనివాస్కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేసిన అందరికీ.. ఇన్సూరెన్స్ చెక్కును కొన్ని రోజుల్లోనే ఇచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్అధికారులకు కమిషనర్స్టీఫెన్రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్జాయింట్కమిషనర్నారాయణ్నాయక్, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇన్స్పెక్టర్నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.