Cyber Crime: ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయద్దు.. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక..!

అపరిచితుల(Strangers) నుంచి వచ్చే ఫోన్ కాల్స్(Phone Calls) పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్(Hyd) సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.

Update: 2024-12-04 16:01 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: అపరిచితుల(Strangers) నుంచి వచ్చే ఫోన్ కాల్స్(Phone Calls) పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్(Hyd) సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. +94777455913, +37127913091, +56322553736, +37052529259, +25590113046 వంటి నంబర్లతో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయద్దని సూచించింది. అలాగే +371(లాత్వియా), +375(బెలారస్), +381(సెర్బియా), +563(లోవా), +370(లిథువేనియా), +255(టాంజానియా ) వంటి కోడ్(Code)లతో ఉన్న నంబర్లతో కాల్ చేసి లిఫ్ట్ చేసాక కట్ చేస్తారన్నారు. తిరిగి కాల్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్(Contact List), బ్యాంక్(Bank), క్రెడిట్ కార్డు(Credit Card) లాంటి డీటెయిల్స్(Details)ను మూడు సెకండ్లలో కాపీ(Copy) చేసుకునే ప్రమాదముందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరైనా #90 లేదా #09 నంబర్లను ప్రెస్(Press) చేయమని సూచిస్తే ఆ ప్రయత్నం చేయద్దని అన్నారు.

Tags:    

Similar News