CV Anand: ‘సారీ సార్.. మీ బదిలీతో అప్ సెట్ అయ్యాను’.. నెటిజన్ కామెంట్ కు సీవీ ఆనంద్ ఇంట్రెస్టింగ్ రిప్లయ్
హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ మరోసారి ట్విట్టర్ లో చర్చగా మారారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఐదుగురు ఏపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఏసీబీ డీజీగా పని చేస్తున్న సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే ఈ బదిలీపై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో నెటిజన్స్ చేసిన కామెంట్స్ కు సీవీ ఆనంద్ ఇచ్చిన ఆన్సర్ ఆసక్తిగా మారింది. 'నో సర్.. మిమ్మల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేను అప్ సెట్ అయ్యాను. మీ లాంటి వారు ఏసీబీలో ఉండటం చాలా అవసరం సర్. ఇప్పుడిప్పుటే లంచాలు తీసుకోవాలంటే కొందరు బయపడుతున్నారు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ఏసీ నుంచి బదిలీ చేయడం నిజంగా నిరుత్సాహపరిచే విషయం ఏది ఏమైనా మీకు ఆల్ ది బెస్ట్ సర్' అంటూ ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. దీనికి స్పందించిన సీవీ ఆనంద్.. 'మేము గవర్నమెంట్ సర్వెంట్స్ కదా.. ఎక్కడ వేస్తే అక్కడ పని చేయాలి' అంటూ బదులిచ్చారు. మరో నెటిజన్ పోస్టుకు బదులిస్తూ.. ఏసీబీలో నా 8 నెలల పదవీకాలంలో చాలా ఆనందించాను. అలాగే కేసుల దర్యాప్తు పరంగా చాలా నేర్చుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల్లో అవినీతిని కొంత అరికట్టడానికి కొన్ని అంశాలు సృష్టించబడ్డాయని, ప్రజలు ప్రభుత్వ అధికారుల మనసుల్లో ఏసీబీ పేరు పునరుద్ధరించబడిందని నేను సంతృప్తి చెందాను. ఏసీబీ చేపట్టిన రెయిడ్స్ విషయంలో ప్రజల ప్రోత్సాహానికి నేను అభినందిస్తున్నాను. అంటూ బదులిచ్చారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ రావడంతో హైదరాబాద్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.