CPM : పోరాడుతున్న పోలీస్ కుటుంబాలపై నిర్బంధం ఆపాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్

బెటాలియన్‌ కానిస్టేబుల్స్‌తో పాటు కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్న న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

Update: 2024-10-27 12:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని battalion constable బెటాలియన్‌ కానిస్టేబుల్స్‌ పనిభారాన్ని పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జివోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కానిస్టేబుల్స్‌తో పాటు కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్న న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం Tammineni Veerabhadram ఒక ప్రకటనలో విడుదల చేశారు. గత రెండు రోజుల్లో బెటాలియన్‌ కానిస్టేబుల్స్‌, వారి కుటుంబసభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. రికార్డు పర్మిషన్‌కు సంబంధించిన జీవోను తక్షణమే ఉపసంహరించాలని, పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానే ఒకే పోలీస్‌ విధానం వుండాలని కోరుతున్నారని వెల్లడించారు. ఈ జీవో వల్ల పనిభారం పెరుగుతోందని, ఒత్తిడికి గురవుతున్నామని, నిరంతరాయంగా 26 రోజులు పని చేయాల్సి వస్తోందని, కుటుంబానికి దాదాపు నెల రోజులు దూరంగా ఉంటున్నామని వారు వాపోతున్నారని వివరించారు.

దీని ఫలితంగా ఇటీవల కాలంలో కొందరు కానిస్టేబుల్స్‌ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయని ఆరోపించారు. వెట్టి చాకిరీ చేస్తున్నా ప్రభుత్వం అదనపు బెనిఫిట్స్‌ కూడా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు వేయడం, ఇళ్లల్లో పని, వ్యవసాయ పనులు వంటివి కానిస్టేబుల్స్‌ దినచర్యలుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వారి పని గౌరవప్రదంగా లేదన్నారు. ఒక విధంగా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. Police constables protest స్పెషల్‌ బెటాలియన్‌ పోలీసుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, సస్సెన్షన్లు రద్దుచేయాలని, పోరాడుతున్న కుటుంబాల మీద నిర్బంధం ఆపాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News