ఆ ఇద్దరికి మేలు చేసేలా బీజేపీ ప్రభుత్వ విధానాలు.. డి.రాజా కీలక వ్యాఖ్యలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్ర విమర్శలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో రాజా మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్ర విమర్శలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో రాజా మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థను మోడీ ప్రొత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం అంబానీ, ఆదానీలకు మేలు చేసే విధంగా బీజేపీ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కోల్‌కత్తా ఘటన చాలా బాధాకరం అన్నారు. దేశంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆవేదన చెందారు.
మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు రావాలని.. పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రిజర్వేషన్, సామజిక న్యాయం వంటి వాటిని ఎత్తి వేయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రైవేటు సెక్టార్‌లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం ప్లేస్‌లో కొత్త మతతత్వ రాజ్యాంగం తేవాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చూస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు వెళ్తామన్నారు.