కాంగ్రెస్, సీపీఐ కలిస్తే.. కేసీఆర్‌కు డిపాజిట్లు కూడా రావ్: CPI నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి వ్యతిరేకంగానే బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని.. కానీ సీఎం కేసీఆర్ నుండి ఇంకా
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి వ్యతిరేకంగానే బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని.. కానీ సీఎం కేసీఆర్ నుండి ఇంకా ముందే తెగదెంపులు చేసుకోవాల్సింది అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కలిస్తే.. సీఎం కేసీఆర్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ ఊగిసలాట నుండి బయటకు రావాలని సూచించారు. టీటీడీ పాలకవర్గం ఎంపికపైనే ఆయన మండిపడ్డారు. లిక్కర్ అమ్మేవారిని వైసీపీ తిరుమల కొండపైకి పంపారని విమర్శలు గుప్పించారు. మాంసం అమ్మే వాళ్లను టీటీడీ మెంబర్లుగా చేశారని నారాయణ ధ్వజమెత్తారు. ఇక, కాంగ్రెస్‌లో ఎప్పుడూ కుమ్ములాటలే ఉంటాయని అన్నారు.