కేటీఆర్ పిటిషన్‌పై విచారించిన కోర్టు ఏం చెప్పిందంటే..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో ఈ రోజు (సోమవారం) విచారణ జరిగింది.

Update: 2024-10-14 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో ఈ రోజు (సోమవారం) విచారణ జరిగింది. కేటీఆర్ తరపున ఈ కేసులో కేటీఆర్‌ తరఫున లాయర్ ఉమామహేశ్వర్‌ రావు వాదనలు వినిపించారు. కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 18వ తేదీన కేటీఆర్‌తో పాటు ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్న సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తామని ప్రకటించింది. అనంతరం కేసును 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరేనంటూ కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 10వ తేదీన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తనపై చేసిన వ్యాఖ్యలు దారుణమని, వెంటనే బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 356 కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను తన తరపు సాక్షులుగా పేర్కొన్నారు. అలాగే కొండా సురేఖ కేటీఆర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు వీడియోతో పాటు మరో 23 సాక్ష్యాలను కూడా కోర్టుకు అందించారు. ఇదిలా ఉంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున కూడా రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.


Similar News