TS నుండి టీజీగా మార్చడానికి రూ.2767 కోట్ల ఖర్చు.. సర్కార్ క్లారిటీ..!

రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల తెలంగాణ అబ్రియేషన్‌ టీఎస్‌ను టీజీగా మార్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రిజస్ట్రేషన్లు సైతం ఇక నుండి టీజీ

Update: 2024-06-09 12:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల తెలంగాణ అబ్రియేషన్‌ టీఎస్‌ను టీజీగా మార్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రిజస్ట్రేషన్లు సైతం ఇక నుండి టీజీ పేరు మీదే కానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు సైతం టీఎస్ నుండి టీజీగా పేర్లు మార్చాయి. అయితే, ప్రభుత్వం తెలంగాణ అబ్రియేషన్ టీఎస్‌ను టీజీగా మార్చడానికి రూ.2,767 ఖర్చు కోట్లు ఖర్చు అవుతోందని.. కాంగ్రెస్ సర్కార్ ప్రజా ధనం వృధా చేస్తోందంటూ ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న నోట్‌పై తాజాగా సర్కార్ క్లారిటీ ఇచ్చింది. పేరు మార్పునకు రూ.2,767 కోట్ల ఖర్చు అవుతోందని సోషల్ మీడియాలో వైలర్ అవుతోన్న నోట్ ఫేక్ అని వెల్లడించింది. ఈ నోట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. అసత్య ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఫేక్ నోట్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News