Harish Rao Yadadri Temple Tour: వివాదంగా మారిన హరీశ్ రావు యాదాద్రి ప్రోగ్రామ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యాదాద్రి ఆలయ పర్యటన వివాదాస్పదంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యాదాద్రి ఆలయ పర్యటన వివాదాస్పదంగా మారింది. లక్ష్మినరసింహ స్వామి ఆలయం మాడవీధుల్లో గురువారం హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజలు చేయడంపై దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయడం ఎండోమెంట్ సెక్షన్ 7 ప్రకారం దేవదాయశాఖ నేరంగా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆలయ ఈవో భాస్కర్ రావు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. దేవుళ్లపై ఒట్టు పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పినందుకు హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ నేతలకో కలిసి పాపప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు. అయితే హరీశ్ రావు కార్యక్రమానికి కౌంటర్ గా కాంగ్రెస్ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఆలయ మాడవీధులను కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా శుభ్రం చేశారు. దీంతో టెంపుల్ పాలిటిక్స్ కాస్త కౌంటర్ పాలిటిక్స్ గా మారి మరింత రంజుగా మారాయి.