కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని తమ రాజకీయాలకే వాడుకుంటుంది: ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బీజేపీ అల్లాదుర్గం లో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Update: 2024-04-30 12:19 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బీజేపీ అల్లాదుర్గం లో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. అలాగే ఈ దేశంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని.. రాహుల్ గాంధీ తాత, నానమ్మ పదే పదే భారత రాజ్యాంగాన్ని మార్చి అవమానించారని అన్నారు.


అలాగే.. దేశంలో తమ ప్రభుత్వం నిలబడటం కోసం ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని.. కాంగ్రెస్ తమ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటుదని.. రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ దారిలో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ధర్మ గ్రంథం అని.. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అంబారీపై ఊరేగించానని గుర్తు చేశారు. అలాగే పార్లమెంట్ లో అడుగుపెట్టిన తొలిరోజే రాజ్యాంగానికి కట్టుబడ్డానని.. రాజ్యాంగం నాకు భారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ తో సమానం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Read More...

BREAKING: జహీరాబాద్ సాక్షిగా మాదిగలకు ప్రధాని మోడీ కీలక హామీ 

Tags:    

Similar News