అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ అరుణ్ రెడ్డిని ఢిల్లీలో పోలీసులు చేసినట్లు తెలిసింది. ఈ మార్ఫింగ్ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ షా ఫేక్ వీడియో తెలంగాణ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 22 మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో కూడా టీపీసీసీ సోషల్ మీడియా టీమ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల బృందం మకాం వేశారు. ఈ కేసులోనే టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది.