మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.. కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్(Dr. Manmohan Singh) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

Update: 2024-12-27 12:46 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్(Dr. Manmohan Singh) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు(passed away). ఆయన మరణంతో జాతీయ కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు మన్మోహన్ సింగ్‌కు నివాలులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటు. మన్మోహన్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరు. భారత దేశం ఒక మహానేతను కోల్పోయిందని అన్నారు. అలాగే భారత ప్రధానిగా ఆయన చేసిన సేవలకు.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న(Bharat Ratna) ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి(Congress MP Mallu Ravi) కోరారు.


Similar News