బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైంది.. కాంగ్రెస్ MLC సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-27 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితకు బెయిల్ వస్తుందని తాము ముందే ఊహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు కావడంతోనే బెయిల్ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు బీజేపీ నేతల చుట్టూ తిరిగి బెయిల్ తెప్పించారని అన్నారు. కవిత బెయిల్‌తోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని సంచలన ఆరోపణలు చేశారు.

కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్ లభించింది. ఈ కేసులో అరెస్టైన కవిత దాదాపు 153 రోజులు జైల్లో ఉన్నారు. ఈ ఐదు నెలల పాటు బీఆర్ఎన్ నాయకులు.. కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. చివరికి ఈరోజు (ఆగస్టు 27న) కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. ఈరోజు సుమారు 2 గంటల పాటు ఇరువైపుల వాడీవేడీ వాదనలు జరగ్గా.. కవిత తరపు లాయర్ ముఖుల్ రోహత్గి వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో.. మహిళగా బెయిల్‌కు కవిత అర్హురాలని ధర్మాసనం అభిప్రాయపడింది.


Similar News