కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు BRS, బీజేపీ ప్లాన్: ఎమ్మెల్యే యెన్నం కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు

Update: 2023-12-11 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేదిలేదని తేల్చి చెప్పారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో బీజేపీ ఓట్లు బీఆర్ఎస్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఆరోపించారు. ఎవరు ఏం చేసిన రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో మనుగడ సాధించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను యెన్నం మహబూబ్ నగర్‌లో ఓడించారు. 


Similar News